దాడులను అరికట్టండి: పిఆర్పీ
హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు, హత్యలు పెరుగుతున్నాయని ప్రజారాజ్యం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, యువరాజ్యం ప్రధాన కార్యదర్శి డా.శ్రావణ్ లు విలేఖరుల సమావేశం నిర్వహించారు. మహిళలపై పెరిగిపోతున్న హింసను ముఖ్యమంత్రి సవాల్ గా తీసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని పార్టీలు, మహిళా సంఘాలు, మేధావులతో సిఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. కొవ్వూరు ఎమ్మెల్యే రామారావు తనకు చెందిన విద్యాసంస్థలో జరిగిన యువతిపై అత్యాచారం, అదృశ్యం సంఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులకు పాల్పడిన నిందితులు పోలీస్ కస్టడిలో దాడికి గురయిన మహిళల శీలాన్ని కించపరుస్తూ అభియోగాలు మోపటాన్ని పోలీసులు నియంత్రించాలని కోరారు. Fast Traking court స్థాపించాలన్నారు. ఈ విధంగా బోలక్ పూర్ లో జరిగిన కలుషితనీటి సమస్యను ఉద్యమస్ఫూర్తితో ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి రూ.1106 కోట్లు, బోలక్ పూర్ అభివృద్ధికి కేటాయించడం జరిగింది. ఇది ప్రజారాజ్యం విజయంగా భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా బస్తీల్లో ఇంకా ఎన్నో సమస్యలున్నాయన్నారు. జలమండలి అడిగిన రూ. 1152 కోట్లు ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలని వారు కోరారు.
News Posted: 20 June, 2009
|