మహిళా కళాశాలకు బాంబు బూచి
హైదరాబాద్ : మలక్ పేటలో ఉన్న శ్రీవాణి మహిళా కళాశాలకు సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో కలకలం సృష్టించింది. కళాశాలో బాంబు పెట్టామని, అది మరికొద్దిసేపట్లే పేలుతుందని ఆంగతుకులు ఫోన్ చేయడంతో ఉలిక్కిపడ్డ కళాశాల యాజమాన్యం భయాందోళనతో పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థునులు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. హుటాహుటిన బాంబ్ స్కాడ్ తో సహా పోలీసులు కళాశాలకు చేరుకుని తనిఖీలు ప్రారంభించారు.
News Posted: 22 June, 2009
|