ట్రెజరీ ద్వారా జీతాలు
హైదరాబాద్ : ఎట్టకేలకు మున్సిపల్ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్టర్ల ఆధారంగా జీతాలు చేతికొచ్చే సమయం వచ్చింది. ఏప్రిల్ నుండి జీతాలు ఇవ్వని మున్సిపల్ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని సిఎమ్ ఆదేశించారు. మున్సిపల్ ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించి సచివాలయంలో ఆర్థిక శాఖ, పురపాలక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ , విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, విశాఖ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించదు. మిగిలిన 29,430 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ.362 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
News Posted: 22 June, 2009
|