హైదరాబాద్ : ఆర్థిక మాంద్యంతో దిక్కుతోచని పరిస్థితులు ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. హైదరాబాద్ కాచిగూడలో సచిన్ అనే సత్యం కంప్యూటర్స్ మాజీ ఉద్యోగి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సాప్ట్వేర్ రంగంలో నెలకొన్న సంక్షోభమే తన ఆత్మహత్యకు కారణమని సచిన్ ఒక లేఖ రాశాడు. మూడు నెలల క్రితం అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. దాంతో అతను తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఈ సంఘటనతో ప్రజల్లో ఆందోళన ఎక్కువవుతోంది. ఆర్థిక మాంద్యంతో విలవిల్లాడుతున్న నిరుద్యోగుల తల్లితండ్రులు తమ పిల్లల విషయంలో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.