టిడిపిలో విభేదాలు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. రాజమండ్రి లోక్ సభ స్థానానికి టిడిపి నుండి పోటీ చేసిన సినీనటుడు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలను అనపర్తి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి ఖండించారు. విమర్శలకు ఘాటుగా స్పందిస్తూ ఆయన మురళీమోహన్ పై ధ్వజమెత్తారు. తన 40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని తెలుసుకోకుండా మురళీమోహన్ తనపై విమర్శలు చేయడం తగదన్నారు. తనపై చేసిన విమర్శలు రుజువైతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని ఆయన అన్నారు. స్థానికి సీనియర్ నేత, వనపర్తి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల, అధికార పక్షానికి కొమ్ముకాసినందువల్లే తాను రాజమండ్రిలో ఓటమి పాలయ్యానని మురళీమోహన్ మీడియాతో వ్యాఖ్యానించడంతో పై విధంగా మాలారెడ్డి స్పందించారు.
News Posted: 24 June, 2009
|