బోనాల ఉత్సవాలు ప్రారంభం
హైదరాబాద్ : గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి ఉత్సవాలతో ప్రారంభమయ్యే బోనాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పార్లూ పూర్తయ్యాయి. అమ్మకు బోనం సమర్పిస్తే కలరా, అతిసారం వంటి అంటురోగాలు ప్రబలవనే నమ్మకంతో ప్రజలు అత్యంత భక్తి, శ్రద్ధలతో ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. వచ్చేనెల 12న సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, పాతబస్తీలోని లాల్ దర్వాజాలో బోనాల ఉత్సవాలు 18, 19, 20 తేదీలలో జరగనున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సావాలు జులై 23 తో ముగుస్తాయి. కేంద్ర ఇంటిలిజెన్స్ వారి హెచ్చరికలతో కనీ వినీ ఎరుగని తీరిలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
News Posted: 25 June, 2009
|