15 నుంచి 9 గంటల విద్యుత్
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ హాల్లో శుక్రవారం ప్రారంభమైన జిల్లాల కలెకర్ల సమావేశంలో పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి జూలై 15 నుంచి రైతులకు 9 గంటల ఉచిత్ విద్యుత్ ను అందించాలని ఆదేశించారు. విద్యతు కోత తప్పనిసరి అయితే ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలన్నారు. విజిలెన్స్ దాడుల్లో పట్టుబడ్డ ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరగా ఓపెన్ మార్కెట్ లోకి విడుదల చేయాలని సిఎం సూచించారు. విద్యుద్ఘాతంతో మరణించిన వారు కుటుంబాలకు నష్టపరిహారం వారం రోజుల్లాగా అందేలా ఓ కమిటీ వేయాలన్నారు. ఇంటింటికీ వెళ్ళి రేషన్ కార్డుల సర్వే నిర్వహించాలని, నవంబర్ 15 లోగా బోగస్ రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పూర్తి చెయ్యాలని ఆయన ఆదేశించారు.
News Posted: 26 June, 2009
|