హైదరాబాద్ : పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యులకే కాదు ప్రభుత్వానికీ భారంకానున్నాయి. ఇప్పటి వరకూ రేషన్ ద్వారా కేజీ కందిపప్పు అందిస్తున్న ప్రభుత్వం అర కేజీకి మార్చేసింది. జులై నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రతి కార్డుదారునికి అరకేజీ కందిపప్పును ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా సమావేశంలో తెలిపారు. కందిపప్పును సప్లై చేసేందుకు గ్లోబల్ టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదన్నారు. దాంతో జులై నుంచి రేషన్ కార్డు ద్వారా కేజీ కందిపప్పు బదులు అరజేకీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.