హైదరాదాబ్ : ఎన్నికల్లో ఓడిపోయానే అక్కసుతోనే తెలుగుదేశం పార్టీ అర్థం లేని విమర్శలను ప్రభుత్వంపై గుప్పిస్తుందని రోశయ్య మండిపడ్డారు. టిడిపి సీనియర్ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి ప్రభుత్వంపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని రోశయ్య పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశాలు ప్రతిపక్షాలతో కలిపి పెట్టాలనడం సబబు కాదని ఆయన నాగంకు హితవు పలికారు. బాబ్లీ ప్రాజెక్టు 2003లో ప్రారంభమైనప్పుడు ఈ విషయంలో టిడిపి ఎందుకు ఉదాసీనత కనబరచిందంటూ ఎదురు ప్రశ్నించారు. టిడిపి వైఖరి ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా ఓటమి చవిచూస్తుందని రోశయ్య వ్యాఖ్యానించారు.