హైదరాబాద్ : రోడ్డు మీద నిలిచి ఉన్న ఓ ఆయిల్ ట్యాంకర్ కు నిప్పు అంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కలవరపడ్డ స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైరింజన్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఎల్బీనగర్ సమీపంలోని కామినేని వద్ద ఈ ప్రమాదం సంభవించింది. లారీ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.