హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణల కేసులో ప్రజారాజ్యం అధినేత కొణిదెల చిరంజీవికి ఊరట లభిచింది. నెల్లూరులో కోడ్ ఉల్లంఘన కేసులో హైకోర్టు చిరంజీవికి స్టే మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోరంటూ న్యాయస్థానం ఆదేశించింది. దీంతో చిరంజీవికి ఊరట లభించినట్లైంది.