గ్లాండ్ ఫార్మాలో పేలుడు
హైదరాబాద్ : హైదరాబాద్ దుండిగల్ లోని గ్లాండ్ ఫార్మా కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించడంతో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఫార్మా కంపెనీలోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News Posted: 29 June, 2009
|