ఎస్ఎఫ్ ఐ ధర్నా
హైదరాబాద్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలే అధిక ఫీజులు వసూలు చేస్తూ సామాన్యులకు భారాన్ని పెంచుతున్నాయంటూ వికారాబాద్ లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు బుధవారం ధర్నాకు దిగారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేస్తూ స్కూల్ పై దాడి చేసి, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థికి గాయాలయ్యాయి.
News Posted: 1 July, 2009
|