సిఎంకు సైకాలజిస్టుల వినతిపత్రం
హైదరాబాద్ : ర్యాగింగ్ నిరోధానికి కళాశాలలో సైకాలజిస్టులను నియమించాలని కోరుతూ బుధవారం కౌన్సిలింగ్ సైకలాజిస్టులు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. కళాశాలల్లో సైకాలజిస్టులను కౌన్సిలర్లుగా నియమించాలని వారు కోరారు. విద్యార్థుల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తి, ర్యాగింగ్ నిరోధానికి కాలేజీల్లో కౌన్సిలర్లును నియమిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని వారు తెలిపారు. తమ సూచనపై సిఎం సానుకూలంగా స్పందించారని కౌన్సిలింగ్ సైకాలజిస్టుల అసోసియేషన్ బృందం తెలిపింది.
News Posted: 1 July, 2009
|