ఐఏఎస్ ప్లాటినం జూబ్లీ వేడుకలు
హైదరాబాద్ : నోబెల్ బహుమతి గ్రహీత సర్ సీవీ రామన్ 1934లో బెంగళూరులో స్థాపిచిన ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐఏఎన్ ప్లాటినం జూబ్లీ వేడుకలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. గురువారం నుండి ప్రారంభమైన ఈ వేడుకలు శుక్రవారం వరకు జరగనున్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో జరుగుతున్న ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా 350 మంది శాస్త్రవేత్తలు, 920 మంది విశిష్ట అతిధులు, విదేశాల నుంచి వచ్చిన 50 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. జీవజాతుల ప్రముఖ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్వినో ఆరిజన్ ఆఫ్ స్పీషీస్ ప్రచురించబడి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రత్యేక వేడుక కూడా జరగనుంది.
News Posted: 2 July, 2009
|