ఖరారైన పిఆర్పీ కార్యవర్గం
హైదారాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడానికి పార్టీ నిర్మాణం కిందిస్థాయి నుంచి పటిష్టంగా లేకపోవడమే కారణమని నిర్ధారణకు వచ్చిన ప్రజారాజ్యం పార్టీ, ఇక నుంచి పార్టీకి జవజీవాలను పోయాలని నిర్ణయించింది. జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజారాజ్యాన్ని మరో ఐదేళ్ళ పాటు పార్టీని పటిష్టతను కాపాడుకోవచ్చని భావించిన ప్రజారాజ్యం పార్టీ జీహెచ్ ఎంసీ కార్యవర్గాన్ని గురువారం ఖరారు చేసింది. అధ్యక్షునిగా కట్టెల శ్రీనివాస్ యాదవ్, అయిదు జోన్ లకు కన్వీనర్లుగా సామా రంగారెడ్డి, ఫిరోజ్ ఖాన్, మేకల సారంగపాణి, నర్సింగరావు, గోవింద అశోక్ లను అధిష్టానం నియమించింది.
News Posted: 2 July, 2009
|