హైదరాబాద్ : జిల్లాలో పర్యటించే మంత్రులు విధిగా సంక్షేమ హాస్టళ్ళను తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల పనితీరుపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు నెలలో ఒక రోజు వసతి గృహాల్లో విధిగా బస చేసి అక్కడ పనితీరును పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.