గురు పౌర్ణమి వేడుకలు
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని షిరిడీ లోనూ, పలు సాయిబాబా దేవాలయాలలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయి నామస్మరణతో మారుమోగుతున్న దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. షిరిడీలో మంగళవారం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో సాయిదర్శనం కోసం బారులు తీరారు. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పంజాగుట్ట, దిల్ షుక్ నగర్ తదితర ప్రాంతాల్లోని సాయి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో గురుపౌర్ణమి సందర్భంగా వేదపండితులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
News Posted: 7 July, 2009
|