ఐఐఎంలో జేపి ప్రసంగం
హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)లో లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ బుధవారం ప్రసంగిస్తున్నారు. 'సోషల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ - ఇన్నోవేటింగ్ ఫర్ సోషల్ ఛేంజ్' అనే అంశం మీద జేపి ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆయన ఐఐఎం విద్యార్థులతో ముఖా ముఖీ చర్చలో పాల్గొంటారని లోక్ సత్తా పార్టీ వర్గాలు వెల్లడించాయి.
'సామాజిక రంగాన్ని ఎంచుకొని కృషి చేసే వారిని మాత్రమే ఐఐఎం వక్తలుగా ఆహ్వానిస్తుంది, విద్యార్థులతో చర్చా వేదికలు నిర్వహిస్తుంది. ఈ ప్రతిష్టాత్మ సంస్థలో రాజకీయ నాయకులను పిలిచే సాంప్రదాయం లేదు. అయితే, రాజకీయ సంస్కరణల కోసం విస్తృతమైన, విస్పష్టమైన ఎజెండాతో పని చేస్తున్నందున జయప్రకాశ్ నారాయణ్ కు మాత్రం మినహాయింపునిచ్చారు' అని పార్టీ వర్గాలు తెలిపాయి.
News Posted: 7 July, 2009
|