గ్రూప్ 1, 2లో కొత్త పోస్టులు
హైదరాబాద్ : నాలుగు రోజుల్లో ఎపిపిఎస్ సి గ్రూప్ 1, 2 - నోటిఫికేషన్ లు వెలువడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2లో ప్రకటించిన పోస్టులతో పాటు 183 పోస్టులను అదనంగా చేర్చినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఈ రెండు పరీక్షలకు అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎపిపిఎస్ సి చైర్మన్ వెంకటరామిరెడ్డి చెప్పారు. వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలకు పెంచారు.
News Posted: 8 July, 2009
|