వైఎస్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీలో కూడా ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో గవర్నర్ ఎన్ డి తివారి పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ఆయన అభిమానులు వైఎస్ జగన్ అభిమాన సంఘాల వారు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైఎస్ తన జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో జరుపుకోవడం గమనార్హం.
News Posted: 8 July, 2009
|