బదిలీలపై ట్రిబ్యునల్ బ్రేక్
హైదరాబాద్ : ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ మళ్ళీ మొదటికొచ్చింది. టీచర్ల బదిలీ ప్రక్రియను నిలిపివేస్తూ ట్రిబ్యునల్ గురువారం స్టే ఇచ్చింది. ప్రస్తుతం పనిచేస్తున్న విభాగాల్లోనే బదిలీలు, ప్రమోషన్లు ఉండాలన్న నిబంధనలపై ట్రిబ్యునల్ స్టే ఇవ్వడంతో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మళ్ళీ మొదటికొచ్చినట్లైంది. ఈనెల 4న ఉపాధ్యాయుల బదిలీలపై విద్యాశాఖ కమిషనర్ ఇచ్చిన నిబంధనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.
News Posted: 9 July, 2009
|