హైదరాబాద్ : దిల్ షుక్ నగర్ లో గురువారం బిటెక్ చదువుకుంటున్న విద్యార్థిని ఆరంతస్తుల భవనం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతున్న విద్యార్థిని తేజశ్వనిగా గుర్తించారు. ఇంజనీరంగ్ మొదటి సంవత్సరంలో మార్కులు తక్కువ వచ్చాయని మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతిదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.