హైదరాబాద్ : పెరిగిన నిత్యావసరాల ధరల తగ్గింపు కోసం భారతీయ జనతా పార్టీ ఈనెల 11న ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ధరల పెరుగుదలకు కారణాలను ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోకపోడవంతో ర్యాలీని నిర్వహించి గవర్నర్ కు వినతిపత్రం సమర్పిస్తామని ఆ పార్టీ నేత రామచంద్ర రావు హైదరాబాద్ లో తెలిపారు. ధరలు అదుపుచేయడానికి ఆర్థికమంత్రి బడ్జెట్ లో ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయమని ఆయన అన్నారు.