భార్యా, పిల్లలపై కత్తితో దాడి
హైదరాబాద్ : పోషించాల్సిన కుటుంబ పెద్దే అనుమానంతో పెళ్ళాం, బిడ్డలపై కత్తితో దాడి చేసిన సంఘటన లాలాపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. మద్యం సేవించిన భర్త గురువారం రాత్రి భార్యతో గొడవకు దిగాడు. ఆ గొడవ ముదిరిపోవడంతో కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన కొడుకుపై కూడా కత్తి దూశాడు. ఈ ఘటనలో గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
News Posted: 10 July, 2009
|