పీపుల్స్ ప్లాజాలో మత్స్య ఉత్సవం
హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్వహించే భారతీయ మత్స్య ఉత్సవం హైదరాబాద్ లో ప్రారంభంకానుంది. ఈనెల 11 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలను పీపుల్స్ ప్లాజాలో నిర్వహించేందుకు మత్స్య పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్ ఎఫ్ డీ బీ), రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వివిధ సంస్థల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు రైతులతో ఇష్టాగోష్టి సమావేశాలు నిర్వహిస్తారని ఎన్ ఎఫ్ డీ బీ సీఈవో పి.కృష్ణయ్య తెలిపారు. చేపల ఉత్పత్తి పెంచడం, ప్రొసెసింగ్, మార్కెటింగ్ పై రైతులకు మెళకువలు నేర్పిస్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ ప్రారంభించనున్నారు.
News Posted: 10 July, 2009
|