మహిళా మంత్రులకు సత్కారం
హైదరాబాద్ : ఇటీవల ఎన్నికల్లో విజయపతాకం ఎగురువేసిన మహిళా మంత్రులను ఆవోపా సత్కరించనుంది. రాష్ట్ర ఆర్యవైశ్య అఫీషియల్స్ అడ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఆవోపా) మహిళా సాధికత శాఖ ఆధ్వర్యంలో ఆగురుగు మహిళా మంత్రులను సత్కరించనున్నారు. రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం 5-30 గంటలకు తొలి మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తోపాటు మంత్రులు గల్లా అరుణకుమారి, జె.గీతారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, కొండా సురేఖ, డి.కె.అరుణలను సత్కరించనున్నట్లు ఆవోపా రాష్ట్ర అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ కళాభవన్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
News Posted: 10 July, 2009
|