మత్స్య ఉత్సవం ప్రారంభం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సంయుక్తంగా పీపుల్స్ ప్లాజాలో నిర్వహిస్తున్న మత్స్య ఉత్సవాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ శనివారం ప్రారంభించారు. మూడురోజుల పాటు జరిగే భారతీయ మత్స్య ఉత్సవం (ఇన్ ఫిష్ 2009)లో పిల్లలు అమితంగా ఆసక్తి చూపే సముద్ర గుర్రాల (సీ ఆర్స్) తో పాటు 18 రకాల చేపలను ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవంలో 60 స్టాల్స్, 30 ఫిష్ కోర్టులు, 30 అక్వేరియం స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో చేపలతో తయారైన వివిధ రకాల ఆహారపదార్ధాలను, సముద్ర ఉత్ప్తతులను విక్రయిస్తారు.
News Posted: 11 July, 2009
|