12న మహంకాళీ బోనాలు
హైదరాబాద్ : ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ ఉజ్జయనీ మహంకాళి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయకమిటీ, దేవాదాయ శాఖ అధికారులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారని భావించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో అడుగడుగునా నిఘా ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారిజామున 4 గంటలకు మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బోనాలు సమర్పించే మహిళలకు, సాధారణ భక్తజనానికి, ప్రముఖులకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా బారీకేడ్లను నిర్మించారు.
News Posted: 11 July, 2009
|