సంగీత సాహిత్య సమ్మేళనం
నెల నెలా తెలుగు వెన్నెల - ద్వితీయ వార్షికోత్సవం
డల్లాస్ : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (టాన్‌టెక్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'నెలా నెలా తెలుగు వెన్నెల' కార్యక్రమం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డల్లాస్ మహానగరంలో జూలై 11 జరిగిన ఈ మహాసభ కోసం యూలెస్‌లోని ట్రినిటీ హైస్కూలు ఆడిటోరియమ్ దాదాపు 1200ల మంది డల్లాస్ తెలుగు కళాభిమానులతో కిక్కిరిసిపోయింది. ఉదయం పది నుంచి రాత్రి 11.30 గంటల వరకు కన్నులు, వీనుల విందులతో పాటు షడ్రసోపేతమైన విందు భోజనాలను కూడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆబాలగోపాలం ఆనందించేలా 'సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం'గా ఎన్ ఎన్ టివి ద్వితీయ వార్షికోత్సవాన్ని ఎంతో బాగా నిర్వహించారు.
తెలుగు సంగీత, సాహిత్య, సినీ రంగాలలో అతిరథ మహారథులైన ప్రముఖులు - పంచమహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్, అవధాన విద్యా వాచస్పతి డాక్టర్ రాళ్ళబండి కవితాప్రసాద్, ప్రసిద్ధ నటులు, రచయితలు, వక్తలు - గొల్లపూడి మారుతీరావు, డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ, రచయితలు, వక్తలు - డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వాసిరెడ్డి నవీన్, జస్టిస్ టి. గోపాలకృష్ణ, ప్రఖ్యాత సినీ గేయ రచయితలు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోసు, జానపద వాగ్గేయకారులు గోరటి వెంకన్న, డాక్టర్ అందెశ్రీ, రచయిత్రి సరోజ శ్రీశ్రీ, నేత్రావధాన కళాప్రపూర్ణులు నిడమర్తి లలిత కామేశ్వరి, కాశీభొట్ల రమాకుమారి, ప్రముఖ నేపథ్యగాయనీ, గాయకులు మనో, ఉష - అందరినీ ఒక వేదిక మీదకి చేర్చి రంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్వహించారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 14 July, 2009
|