ర్యాగింపై ఉక్కుపాదం
హైదరాబాద్ : ర్యాగింగ్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ర్యాగింగ్ వల్ల విద్యార్థినీ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొనడం వల్ల ర్యాగింగ్ నిబంధనలు పాటించని కళాశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి హెచ్చరించారు. ర్యాగింగ్ ను అరికట్టడం ప్రాధమిక అంశం అన్నారు. ర్యాగింగ్ తీవ్రతను బట్టి కఠనంగా శిక్షలు అమలు చేస్తామన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్ ను అరికట్టకుంటే యాజమాన్ని సైతం అరెస్ట్ చేసేందుకు వెనకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహాల్లో ఈ రోజు ఉదయం జరిగిన ర్యాగింగ్ పై ఉన్నతస్థాయి సదస్సులో ఆయన పై విధంగా ర్యాగింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ర్యాగింగ్ ని నిరోధించడానికి కళాశాలల యయాజమాన్యాలతో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ యాదవ్, ఎంపీ కేవీపీ రామచంద్రారావు, ఉన్నత విద్యాశాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
News Posted: 14 July, 2009
|