హైదరాబాద్ : అంతర్ జిల్లాల ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియకు ట్రిబ్యునల్ పచ్చజెండా ఊపింది. ఎన్ టైటిల్ మెంట్ పాయింట్ల ప్రకారం టీచర్లు తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీలు చేయాలని ట్రిబ్యునల్ బుధవారం విద్యాశాఖను ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయుల బదిలీలకు మోక్షం లభించినట్లైంది. కాగా ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యింది.