ఎమ్మెల్యేలకు శిక్షణాతరగతలు
హైదరాబాద్ : మొదటిసారి ఎన్నికైన తమ పార్టీ సభ్యులకు శిక్షణ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ శిక్షణా శిభిరాన్ని ఈనెల 25, 26 తేదీలలో నిర్వహించడానికి ఏర్పాట్లను చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 74 మంది కొత్త శాసనసభ్యులు ఈ శిక్షణకు హాజరవుతారు. సీనియర్ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు వీరికి పాఠాలు చెబుతారు. అలానే వివిధ అంశాలలో నిపుణులైన అధ్యాపకులు కూడా తరగతులు నిర్వహిస్తారు. శాసనసభలో సభ్యులు ప్రవర్తించవలసిన తీరు, వ్యక్తిగత నైపుణ్యం, భావప్రకటనలో స్పష్టత తదితర అంశాలపై శిక్షణ ఉంటుంది. ఈ శిభిరాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ 26వ తేదీన సందర్శిస్తారు. కాగా ప్రభుత్వ చీఫ్ విప్ భట్టి విక్రమార్క, డెప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శిక్షణా శిభిర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
News Posted: 15 July, 2009
|