సిటీప్లానర్ ఇంటిపై ఏసీబీ దాడులు
హైదరాబాద్ : అవినీతి నిరోధక శాఖ వల్లో మరో అవినీతి తిమింగలం చేరింది. గ్రేటర్ హైదరాబాద్ అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్ పురుషోత్తం రెడ్డి నివాసాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. హైదరాబాద్, భువనగిరిలో, నల్గొండలలోని ఆయన ఇళ్ళపై ఈ దాడులు కొనసాగాయి. వీరి తనిఖీల్లో రూ.20 కోట్లు విలువ చేసే ఆస్తులు, విలువైన పత్రాలను, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. పురుషోత్తమరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.
News Posted: 16 July, 2009
|