హైదరాబాద్ : ఏసీబీకి వల్లో మరో అవినితి చేప చిక్కింది. పటాన్ చెరువు మండలం బేరంగూడ విద్యుత్ శాఖ ఏఈ అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శుక్రవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ పని నిమిత్తం ఆయన 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దాంతో అధికారులు ఏఈని పధకం ప్రకారం పట్టుకున్నారు.