హైదరాబాద్ : ఆస్పత్రిలో మూడు రోజులు చంటిబిడ్డ మాయం కావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. చార్మినార్ యునానీ ఆస్పత్రి నుంచి మూడు రోజుల పసికందు అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. తమ బిడ్డను గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్ళినట్లు మొఘల్ పూర్ పోలీసు స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.