ఉపాధ్యాయుల ఆందోళన
హైదరాబాద్ : పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు చేస్తున్నారని టీచర్లు ఆందోళన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పాఠశాల విద్యాలయ శాఖ కార్యాలయంలోకి అధికారులు వెళ్ళకుండా ఆపాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు విడతల వారీగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో కార్యాలయం వద్ద ముందే బందోబస్తుగా ఉన్న పోలీసులు ఇదే అదనుగా అక్కడకు వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేశారు. ఈ సంఘటనతో పోలీసులకు, ఉపాధ్యాయులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.
News Posted: 20 July, 2009
|