హైదరాబాద్ : ఘట్ కేసర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిడిపి ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ భర్త గోవిందనాయక్ రాథోడ్ మృతి చెందారు. ఘట్ కేసర్ వద్ద మోటార్ బైక్ పై వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. డోర్నకల్ శాసనసభ్యురాలు సత్యవతి రాథోడ్ భర్తను ప్రత్యర్థులు హత్య చేసి ఉండవచ్చని సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేలో ఎస్సైగా పనిచేస్తున్న గోవింద రాథోడ్ ఆయన స్వగ్రామానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం సంభించింది. డోర్నకల్ లో వరుసగా అయిదుసార్లు గెలిచిన రెడ్యానాయక్ పై గత ఎన్నికల్లో టిడిపి మహిళా నేత సత్యవతి రాథోడ్ గెలవడం తెలిసిందే.