కూకట్ పల్లి ఎస్ ఐ అరెస్ట్
హైదరాబాద్: తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేయడంతో కూకట్ పల్లి సబ్ ఇన్ స్పెక్టర్ సునీల్ ను మల్కాజిగిరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతన్ని కూకట్ పల్లిలో అరెస్టు చేసి మల్కాజిగిరి పోలీసు స్టేషనుకు తరలించారు. మల్కాజిగిరిలో ఎస్సైగా పని చేస్తున్న సమయంలో సునీల్ మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను బాలికపై అత్యాచారం చేయలేదని, ఆమె అంగీకారం మేరకే సెక్స్ చేశానని సునీల్ అంటున్నాడు. కాగా అమెను డిఎన్ ఏ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే రిపోర్టులను తారుమారు చేసే అవకాశం ఉందని బాధితురాలి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News Posted: 21 July, 2009
|