హైదరాబాద్ : మెడిసిన్ ర్యాంకర్ విద్యార్థి తనకు న్యాయం చేయలంటూ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని మంగళవారం కలుసుకున్నారు. మెడిసిన్ లో 9వ ర్యాంకర్ సాధించిన సాయిరాం సిఎం ను కలుసుని ఓ వినతి పత్రం సమర్పించాడు. మెడిసిన్ లో చేరేందుకు సాయిరామ్ కు వయోపరిమితి చాలదంటూ అధికారులు కౌన్సెలింగ్ అడ్మిషన్ ని నివిపివేయడంతో సాయిరాం సిఎం ను కలుసుకుని తన మొర వినిపించి న్యాయం చేయాలంటూ అర్థించాడు.
మెడిసిన్ లో చేరాలంటే ప్రతిపాదికన తేదీ నాటికి విద్యార్థికి 17 సంవత్సరాలు నిండి ఉండాలన్నతి భారతీయ వైద్యమండలి నిబంధన. అయితే సాయిరాంకు 17 సంవత్సరాలు పూర్తి కావడానికి 15రోజులు తక్కువయ్యాయి. దీంతో సాయిరాం ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అతని ప్రవేశాన్ని ప్రత్యేక కేసు కింద పరిగణనలోకి తీసుకుని వయసు నిబంధనను సడలిస్తూ ఉన్నత విద్యాశాఖ ఈనెల 18న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఓయూలో నిన్న జరిగిన కౌన్సెలింగ్ లో సాయిరాంకు చుక్కెదురైంది. నిబంధనల ప్రకారం అధికారులు అతనికి ప్రవేశాన్ని నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని ఆశ్రయించాడు.