గోపీచంద్ కు బాబు అభినందన
హైదరాబాద్ : ప్రముఖ క్రీడాకురులు గోపీచంద్ కు, సైనా నెహ్వాల్ కు అత్యున్నత క్రీడా పురస్కారాలు లభించడం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు ద్రోణాచార్య అవార్డు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు అర్జున అవార్డు లభిచండంతో ఇరువురుని అభినందించారు. ఇండోనేషియన్ సూపర్ సిరీస్ టైటిల్ ఛాంపియన్ సైనా నెహ్వాల్ భవిష్యత్ లో మరింతి ప్రతిభ చూపి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేయాలని ఆకాక్షించారు. గోపీచంద్, సైనా నెహ్వాల్ ల స్ఫూర్తితో వర్థమాన క్రీడాకారులు తమ ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు.
News Posted: 21 July, 2009
|