త్వరలో విలేజ్ కోర్టులు
హైదరాబాద్ : త్వరలో గ్రామ న్యాయస్థానాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వివిధ న్యాయస్థానాల్లో లెక్కకు మించిన కేసులు పెండిగ్ లో ఉన్న నేపథ్యంలో విలేజ్ కోర్టులను ఏర్పాటు చేస్తే బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని భావించిన ప్రభుత్వం త్వరలో గ్రామ న్యాయస్థానాలను ఏర్పాటు చేయనుంది. ఈ విలేజ్ కోర్టుల ద్వారా పెండింగ్ కేసుల భారం తగ్గడమే కాక బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మండల స్థాయిలో గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలని అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైఎస్ నిర్ణయించారు. ఆగస్టు 9న జిల్లా కోర్టుల ఏర్పాటుపై, న్యాయనిపుణులతో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
News Posted: 23 July, 2009
|