కటారికి ఎన్నారై సహాయం
హైదరాబాద్ : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కటారి గోపి కుటుంబానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మిచ్ గావ్ ఎన్ ఆర్ ఐ (యుఎస్ ఎ) వారు అందించిన రూ.50,000 చెక్కును అందజేశారు. గోపి ఇద్దరు కుమారులకు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో ఉచితంగా విద్యను అందిస్తామని బాబు తెలిపారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం కెవిబి పురం మండలం రాగుటం గ్రామానికి చెందిన కటారి గోపి ముంబైలో కూలి పని చేసేవారు.
News Posted: 24 July, 2009
|