టెన్త్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల
హైదరాబాద్ : పదోతరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సచివాలయంలోని తన చాంబర్లో శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 37.07 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 35.15, బాలికలు 40.15 శాతం ఉన్నారు. సబ్లిపెంటరీ ఫలితాల్లో ప్రధమ స్థానంలో నిజామాబాద్ జిల్లా, చివరి స్థానంలో హైదరాబాద్ లు నిలిచాయి. పదోతరగతిలో వచ్చే ఏడాది నుండి గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రాధమిక విద్యాశాఖ మంత్రి మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. అలానే జవాబు పత్రాలను అభ్యర్థులకు జిరాక్స్ కాపీలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి దీన్ని అమలులోకి తీసుకువస్తామని చెప్పిన మంత్రి అన్ని సబ్జెక్టులకు బార్ కోడింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.
News Posted: 24 July, 2009
|