హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ త్వరలో ఆరోగ్యశ్రీ కార్డులను అందించనున్నట్లు ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. రెండు నెలల్లో జర్నలిస్టులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ అమలుపై సంబంధింత అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.