ఆన్ లైన్ మోసగాళ్ళు అరెస్ట్
హైదరాబాద్ : ఆన్ లైన్ లో మార్కెటింగ్ పేరిట ప్రజలను చీటింగ్ చేస్తున్న ముఠా సభ్యులనుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్ పల్లిలో ఆన్ లైన్ చీటింగ్ కు పాల్పడుతున్న సభ్యుల గుట్టును రట్టు చేశారు. వారి వద్ద నుండి 47 లక్షల నగదును, కేజీన్నర బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన నలుగురు నిందితుల్ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
News Posted: 27 July, 2009
|