కాపు నేతలకు సన్మానం
హైదరాబాద్ : రాష్ట్రంలోని కాపు ప్రజా ప్రతినిధులకు శుక్రవారం సాయంత్రం సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరుకాపు, తూర్పుకాపు సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని బాగ్ లింగంపల్లిలో ఉన్న ఆర్టీసీ కల్యాణమండపంలో సాయంత్రం 5 గంటలకు ఈ సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుందని సంఘం పేర్కొంది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ముద్దుశెట్టి గోపాలకృష్ణ అధ్యక్షత జరిగే ఈ సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు, అన్నయ్యగారి సాయి ప్రతాప్, రాజ్యసభ సభ్యులు పద్మశ్రీ దాసరి నారాయణరావు, ఉత్పల హనుమంతరావు, కంచర్ల కేశవరావు, లోక్ సభ సభ్యులు బొత్స ఝాన్సీరాణి, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణ, దానం నాగేందర్, వట్టి వసంతకుమార్, శ్రీమతి కొండా సురేఖ, పిఆర్పీ శాసనసభా పక్షనాయకుడు కొణిదెల శివశంకర వరప్రసాద్ (చిరంజీవి), ఇతర ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులను సన్మానిస్తున్నట్లు సంఘం ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కాపు సోదరులను సంఘం ఆహ్వానించింది.
News Posted: 31 July, 2009
|