వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం
హైదరాబాద్: ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ శుక్రవారం ఉదయం నుండి ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఆప్షన్లు నమోదు చేసుకునేందకు ఒక్కో ర్యాంకర్ మూడు రోజుల్లోపు ఉన్న ఈ గడువును వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 630 ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండు లక్షల పదివేల సీట్లు ఉన్నాయి. 31వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీవరకు అభ్యర్థులు ర్యాంకుల ఆధారంగా నిర్దేశిత తేదీల్లో ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్టవ్య్రాప్తంగా 50 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17న సీట్లను కేటాయిస్తారు. వెబ్ లో ఉంచిన ఇంజనీరింగ్ కాలేజీల్లో 21 యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలు, 564 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 235 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి.
News Posted: 31 July, 2009
|