అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ
హైదరాబాద్ : వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని రాష్టవ్య్రాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గ అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. అలానే ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని కనకమహాలక్ష్మి అలయంలో పంచామృతం అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు.
News Posted: 31 July, 2009
|