నిమ్స్ కు పురస్కారం
హైదరాబాద్ : అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో సెప్టెంబర్ లో నిర్వహించనున్న ట్రాన్స్ క్యాథటర్ కార్డియోవాన్క్యులర్ థెరిపీయోటిక్స్ (టీసీటీ) సింపోజియానికి నిమ్స్ లోని కార్డియాలజీ డిపార్ట్ మెంట్ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి ఎంపికైంది. నిమ్స్ కార్డియాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో క్లిష్టమైన కేసును నయం చేసినందుకుగానూ ఈ పురస్కారానికి అర్హత సాధించింది. కరోనరీ యాంజియో ప్లాస్టిలో భాగంగా ఇంట్రా అర్టిక్ బెలూన్ పంప్ (ఐఎబీపీ) ఆధారంతో అతిక్లిష్టమైన కేసును నిమ్స్ కార్డియాలజీ విభాగపు అదనపు ప్రొఫెసర్ కె.శరత్ చంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పంక్ జరీవాలా విజయవంతంగా పూర్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కుచెందిన ఓ రోగికి కార్డియో జెనిక్ షాక్, ఆక్యూట్ మయోకార్డియల్ ఇన్ ఫారెక్షన్ ద్వారా సేవలందించారు. ఈ కేసును సెప్టెంబర్ లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్నటిసీటీ సింపోజియంలో డాక్టర్ పంకజ్ జరీవాలా ప్రదర్శించనున్నారు.
News Posted: 31 July, 2009
|